మెదక్ : ఫైరింగ్ రేంజ్ పనులను పరిశీలించిన ఎస్.పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా నార్సింగి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఫైరింగ్ రేంజ్ పనులను జిల్లా ఎస్.పి డీ. ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
ఇప్పటివరకు ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం ఇతర జిల్లాల్లోని ఫైరింగ్ రేంజ్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండేదని ఈ లోటును త్వరగా పరిష్కరించి పోలీస్ సిబ్బందికి తక్కువ సమయంలో ప్రాక్టీస్‌కు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్బంగా తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్, తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఆర్.ఐ శైలేందర్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు పూర్తయిన తర్వాత పోలీసులకు తక్షణ శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యం పెరగనున్నట్లు అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment