|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మక్కపల్లి సాయవ్వ (వయస్సు 57), అనే మహిళను ఆమె స్వంత కొడుకు సాయిలు పింఛన్ డబ్బుల విషయంలో గొడవపడి హత్య చేశాడు. కుటుంబంలో జరిగిన తగాదా అనంతరం కోపంతో ఊగిపోయిన సాయిలు మొదట తల్లి సాయవ్వను కుర్చీతో కొట్టాడు. తర్వాత రాయిని తీసుకొని తలపై, చాతి మరియు కడుపుపై బలంగా దాడి చేసి అక్కడినుంచి పరారయ్యాడు.
చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర గాయాలపాలైన సాయవ్వను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. అయితే వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. బాధితురాలి చెల్లెలు కొడుకు జట్టి మహేష్ ఫిర్యాదుపై వర్ని పోలీస్ స్టేషన్ ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








