|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నాడు మామిడి కళ్యాణి ఎస్సైగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలు కొనసాగించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడతారని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండల పరిధిలో జూదం వంటి నిషిద్ధ కార్యకలాపాలు జరగకూడదని, అలాంటి పరిస్థితుల్లో తగిన విధంగా శిక్షించబడతారని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి, మండలాన్ని శాంతియుత వాతావరణంగా నిలుపుకోవాలని ఎస్సై కోరారు. ప్రజల నుంచి సమన్వయం లభిస్తే మానవతా దృక్పథంతో పోలీసు విధులను నిర్వహించడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.








