లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ కృష్ణకుమార్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై కృష్ణకుమార్ ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు. కోటయ్య క్యాంపు గ్రామానికి చెందిన రైతు నాగరాజు వద్ద నుండి రూ. 20,000 లంచం తీసుకుంటున్న కృష్ణకుమార్‌ను ఏసీబీ బృందం పట్టుకుంది.

ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాలో ఎస్సై కృష్ణకుమార్ రైతు నుండి లంచం డిమాండ్ చేసి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు, వివిధ కేసులలో కృష్ణకుమార్ వ్యవహరించే విధానంపై అనేక ఆరోపణలు ఉన్నాయని సమాచారం.

ఎస్ఐ కృష్ణకుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు, ఈ కేసు విషయంలో ఏసీబీ అధికారులు మరింత పరిశీలన చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment