మెదక్‌లో జూదంపై పోలీసుల ఉక్కుపాదం.. పేకాట స్థావరంపై దాడి, ఏడుగురు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. గ్రామానికి చెందిన దేవినేని రమేష్ నివాసంలో జూదం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.46,720 నగదు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment