మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రబ్బర్ బొల్లార్డ్స్ ఏర్పాటు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సాపూర్ నుండి మెదక్ వరకు ఉన్న బ్లాక్ స్పాట్స్ వద్ద రబ్బర్ బొల్లార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హైవే 765D పై ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

గతంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో రెఫ్లెక్టివ్ రబ్బర్ బొల్లార్డ్స్ ఏర్పాటు చేయడం వల్ల రాత్రి సమయంలో రహదారి స్పష్టంగా కనిపించడంతో పాటు, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది అని, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు ఈ బొల్లార్డ్స్ ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.

అదేవిధంగా మెదక్ జిల్లాలో రోడ్డు భద్రతను పెంచేందుకు, ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారాని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని ఎస్పీ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment