మెదక్‌లో SBI దొంగతనం ప్రయత్నం విఫలం – పోలీసుల వేగవంతమైన చర్య.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 08-08-2025న దొంగతనం ప్రయత్నం విఫలమైంది. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాలపై డీఎస్పీ ప్రసన్నకుమార్ నేతృత్వంలో సీఐ మహేష్ ప్రత్యేక బృందం అత్యంత వేగంగా స్పందించి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించింది.

కేసును తక్కువ సమయంలో చేధించినందుకు SBI సిద్దిపేట్ రీజినల్ మేనేజర్ మూర్తి, మెదక్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి పోలీస్ అధికారులను అభినందించారు. నిందితులను పట్టుకున్న సిబ్బంది నిఖిల్, నర్సింలు, మల్లేశం, ఐటీ కోర్ సిబ్బంది వెంకట్, మహేందర్ గౌడ్లకు ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మొక్కను అందజేసి పోలీసుల అప్రమత్తతకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment