|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్ర శివారులోని చేన్ల వాగు వద్ద అనేక ఇసుక అక్రమ రవాణా ముఠాలు చేరి ఇసుకను యదేచ్ఛగా దోచుకోవడం ప్రారంభించాయి,
ఈ ముఠాలు స్థానిక అవసరాలను సాకుగా చూపించి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ఇసుక పై ఉన్న అనుమతులను దుర్వినియోగం చేస్తూ స్థానిక తహశీల్దార్ అధికారి ఈ ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చిన సమయం అదునుగా చూసుకొని ఇసుక అక్రమ వ్యాపారులు వే బిల్లులపై అనుమతి ఒక్కటీ మాత్రమే వుండగా నాలుగు రెట్లు ఎక్కువగా ఇసుకను తరలిస్తున్నారు.
ఇసుక రవాణాకు అవసరమైన వే బిల్లుల జిరాక్స్ కాపీలను స్థానిక ప్రజలకు అనుమతులుగా ప్రదర్శిస్తూ, అనుమతులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు, ఈ అక్రమ వ్యాపారం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందని, ఈ రవాణా వల్ల భూగర్భ జలాలు తగ్గి, రబి సీజన్లో బోరు బావులు ఎత్తిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల మధ్య, స్థానికుల ప్రశ్నలకు సమాధానంగా, ఇసుక అక్రమ వ్యాపారులు తహశీల్దార్ సంతకం ఉన్న వే బిల్లు జిరాక్స్ కాపీలను చూపిస్తూ, తమ చర్యలను చట్టబద్ధంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, ఈ అనుమతి పత్రాలు బయటకు వెలువడడం అధికారుల పాత్రపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
స్థానిక రైతులు, ఈ అక్రమ వ్యాపారం వల్ల తమ వ్యవసాయంపై ఎలా ప్రభావం పడుతోందో, అది ప్రభుత్వా ఆదాయానికి ఎంతలా నష్టం కలిగిస్తోందో అనే ఆందోళన వ్యక్తం చేస్తు ఈ అక్రమ రవాణాపై ప్రభుత్వ ఉన్నత అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడంలో సంబంధిత అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారో అనే విషయమై సమాధానం కోసం నిరక్షిస్తూ ఇది ప్రభుత్వ అధికారుల విధి విధానాలపై అనేక ప్రశ్నలు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిస్థితులు, ఆర్థిక నష్టానికి దారితీస్తే, పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరమని, తమ వ్యవసాయాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవడం, అంతేకాకుండా భూగర్భ జలాలు మరియు వ్యవసాయ భూముల పరిరక్షణపై సమగ్ర దృష్టి పెట్టాలని సంబంధిత ఉన్నత అధికారులకు రైతులు మనవి చెసుకుంటున్నారు.










