|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ సర్కిల్ పరిధిలో పేకాట జూదరులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీఐ రేణుక రెడ్డి నేతృత్వంలో రేగోడ్ పోలీసులు కొండాపూర్ గ్రామ శివారులో అక్రమ పేకాట ఆడుతున్న 19 మంది యువకులను పట్టుకున్నారు. వీరితో పాటు నగదు ₹2,19,000, మొబైల్ ఫోన్లు, కారు, ఆటో, బైక్లను స్వాధీనపరచి కోర్టులో జమ చేశారు.
సీఐ రేణుక రెడ్డి మాట్లాడుతూ – “పేకాట మోజులో పడకండి, కుటుంబాలను విచ్ఛిన్నం చేయొద్దు” అని యువకులకు సూచించారు. పేకాటకు స్థలం కల్పించిన వారిపై కూడా కేసులు నమోదు చేసి ఆ ప్రదేశాలను సీజ్ చేయనున్నట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ కూడా జూదం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రేగోడ్, అల్లాదుర్గ్ సర్కిల్ పరిధిలో ఇకపై పేకాటకు తావు ఉండదని పోలీసులు హెచ్చరించారు. యువత క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్తును సురక్షితంగా చేసుకోవాలని సూచించారు.








