ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. “సివిల్ రైట్స్ డే” అమలు చేస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం :

కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శశికళ, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అట్రాసిటీ కేసుల పరిష్కారం & బాధితులకు పరిహారం :

➡️ నమోదైన అట్రాసిటీ కేసులపై సమీక్ష.
➡️ బాధితులకు న్యాయం, పరిహారం అందించడానికి చర్యలు.
➡️ సబ్-డివిజన్ స్థాయిలో విజిలెన్స్ కమిటీ సమావేశాలు.
➡️ అవగాహన కార్యక్రమాలు, చట్టాల ప్రకారం పరిహారం చెల్లింపు.

జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా, బాధితులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment