ప్రైవేట్ ఫైనాన్స్ దురాగతాలు: సామాన్యులపై దోపిడీకి ఉక్కుపాదం.

|| దృశ్యం న్యూస్ ||

ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దుర్మార్గాలు మితిమీరిపోయాయి. కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఫైనాన్సులు సామాన్యులపై ఉక్కుపాదం వేస్తున్నాయి. ఆర్బీఐ అనుమతుల పేరిట అమాయకులను వడ్డీ బానిసలుగా మలుస్తున్నారు.

ఫైనాన్స్ కంపెనీకి సమయానికి రుణం తిరిగి చెల్లించలేని కుటుంబాల ఇళ్లపై “జప్తు”, “వెంటనే చెల్లించండి” అంటూ గోడలపై పెద్ద అక్షరాలతో ఫైనాన్షియర్స్ రాసి మరి బెదిరిస్తున్నారు. ఈ ఘటనలతో రుణ గ్రహీతలు భయాందోళనకు గురవుతు మానసిక హింసకు లోనవుతున్నారు.

“తక్కువ వడ్డీ”, “సులభమైన పద్ధతి” అంటూ మాయ మాటలతో మొదట ఆకర్షించి, డబ్బులు ఖాతాలోకి వచ్చాక అసలైన వేధింపులు మొదలవుతాయి. నెలవారీ వాయిదా ఆలస్యమైతే వడ్డీ కన్నా రెట్టింపు రుసుములు, బెదిరింపులు, ఫోన్ కాల్స్ మొదలుపెడుతున్నారు.

రుణగ్రహితులపై ఒత్తిడి పెంచుతూ, పెద్ద మొత్తంలో సంతకాలు తీసుకుంటూ, చట్టపరంగా బలహీనంగా మారుస్తున్నారు. “జప్తు చేస్తాం”, “ఇది మా అధీనంలో ఉంది” అంటూ బెదిరింపులు పెడుతున్నారు. ఇంటి తాళం వేసే స్థాయిలో దౌర్జన్యానికి దిగుతున్నారు.

ప్రభుత్వ నియంత్రణ లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న ఈ ఫైనాన్స్ మాఫియా, పేదల ఆదాయాన్ని దోచుకుంటూ సామాన్యులకు నరకాన్ని చూపెడుతోంది.

సామాన్యుల సభ్య సమాజం రక్షణ కోసం సంబంధిత ప్రభుత్వ అధికారులు తక్షణం జోక్యం చేసుకుని నియంత్రణ విధానాలు అమలు చెయ్యాలని రుణ గ్రహీతలు వేడుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment