|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.57,830 నగదు మరియు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మడుగుల అరుణ్, కేదారి చంద్రం, చిట్టం వెంకటేష్, పరా ప్రవీణ్, గోపాటి పెంటయ్య, మచ్చు శ్రీకాంత్‌లను పట్టుకుని చేగుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సమన్వయంతో ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో పేకాట, బెట్టింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, ముఖ్యంగా యువత ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు తెలియజేయాలని ప్రజలను కోరారు.








