|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పోడ్చన్‌పల్లి తండా సమీపంలో బొమ్మా బొరుసు జూదం ఆడుతున్న 10 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించగా, కొందరు వ్యక్తులు అక్రమంగా జూదంలో పాల్గొంటున్నట్లు గుర్తించారు.
వెంటనే వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.20,040 నగదు మరియు 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో మదారి లింగం, జుకంటి బాబు, జిలకర సాయిలు, వడ్డే సాయిలు, బుచ్చం రాజు, షేక్ రఫీ, గోవింద్, ఆంజనేయులు, తాడేపు సంతోష్, బోడ వినోద్, కొమ్ముల అనిల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పాపన్నపేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జూదాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.








