|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ పరమర్శించారు.
కార్యక్రమం సందర్భంగా, పోలీసు సిబ్బంది అమరుల ఫోటోలు వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాల గురించి కుటుంబ సభ్యులతో చర్చించడం జరిగింది. వారి కష్టాలను, అవసరాలను తెలుసుకోవడం కోసం, ప్రభుత్వ సహాయానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు.
అదేవిధంగా అమరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వారికి కావాల్సిన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశాలను ఇచ్చారు సమస్యలు ఉన్నప్పుడు పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకురావాలని కుటుంబ సభ్యులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహాయాన్ని అందిస్తామని, వారి బాధ్యతలపై అధికారుల నిబద్ధతను మరింత కట్టుదిట్టం చేసేందుకు అగ్రగామిగా అడుగులు వేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ కోటేశ్వరరావు, ఎన్.ఐ.బి ఇన్స్పెక్టర్ ఎన్. సత్య ప్రసాద్, టౌన్ సి.ఐ శ్రీనివాస్ రాజ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా మరియు సి.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.










