పేకాటపై పోలీసులు కఠిన చర్యలు – 138 కేసుల్లో 599 మంది అరెస్ట్‌ – రూ.14.15 లక్షలు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసు విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తేదీ 19-10-2025 నుండి 22-10-2025 ఉదయం 10 గంటల వరకు జరిగిన చర్యల్లో మొత్తం 138 కేసులు నమోదు, 599 మంది పేకాటదారులు పట్టుబడడం, అలాగే రూ.14,15,917=00 నగదు స్వాధీనం చేయడం జరిగింది.
జిల్లాలోని డివిజన్ వారీగా వివరాలు చూస్తే —
🔹 నిజామాబాద్ డివిజన్: 42 కేసులు, 180 మంది అరెస్ట్‌, రూ.5,13,402 స్వాధీనం.
🔹 ఆర్మూర్ డివిజన్: 44 కేసులు, 232 మంది అరెస్ట్‌, రూ.5,51,785 స్వాధీనం.
🔹 బోధన్ డివిజన్: 52 కేసులు, 187 మంది అరెస్ట్‌, రూ.3,50,730 స్వాధీనం.
మూడు డివిజన్‌లలో కలిపి మొత్తం 138 కేసులు నమోదు కాగా, 599 మంది పేకాటదారులు పట్టుబడ్డారు. పోలీస్ కమిషనర్ తెలిపారు. పండుగ సీజన్‌ను దుర్వినియోగం చేసుకునే అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలు, కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని. ప్రజలు చట్టం పాటించాలని, పేకాట వంటి చట్ట విరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment