నిజామాబాద్: 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్‌ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఈరోజు జరుగుతున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని SFS స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశిస్తూ, పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ – 2023 అమలులో ఉంటుందని తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిందని తెలిపారు.

పరీక్షల సమయంలో ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని కమిషనర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సమయాన్ని సరిగ్గా నిర్వహించుకుంటూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

అదేవిధంగా, స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్న నిర్మల హృదయ స్కూల్‌ను కూడా సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్బంగా టౌన్ CI శ్రీ శ్రీనివాస్ రాజ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment