|| దృశ్యం న్యూస్ ||
భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, ఎంతోమంది పేద, బడుగు, బలహీన విద్యార్థులు స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి చదువుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాయిదా వేయకుండా విడుదల చేయాలని కోరారు.
ఇటువంటి పెండింగ్ సమస్యలు వల్ల విద్యార్థులు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో BDSU జిల్లా అధ్యక్షులు లాలు, పట్టణ కార్యదర్శి ప్రసాద్, ఈశ్వర్ ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.








