వరుస విధికుక్కల దాడులతో గ్రామస్తులలో భయాందోళన.

|| దృశ్యం న్యూస్ ||

వీధి కుక్కలు చేస్తున్న వరుస దాడులు, ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలోని ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది. మంగళవారం గ్రామంలో ఓ వ్యక్తిపై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేశాయి.
ఈ దాడిలో సోఫీ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు వాటిల్లి, రక్తస్రావం జరగడంతో స్థానికులు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గత 15 రోజుల క్రితం కూడా ఈ గ్రామంలో ఒక మహిళపై కుక్కలు దాడి చేశాయి. ఈ వరుస సంఘటనలతో గ్రామంలో మరింత భయాందోళన నెలకొంది.
కేవలం ఈ గ్రామంలోనే కాకుండా, దుబ్బా తండాలో కూడా పలువురిపై వీధి కుక్కలు దాడి చేసినట్లు సమాచారం.

ఇప్పటివరకు వీధి కుక్కల సమస్యపై ఎన్ని సమస్యలు, ప్రమాదాలు నెలకొన్న అధికారుల నుండి సమాధానం లేకపోవడం వారి నిర్లక్ష్యాన్ని చూపుతోంది, గ్రామస్థులు ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని తీవ్రంగా అభ్యర్థిస్తున్నారు.

ఈ విధికుక్కల దాడుల సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలకు పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని, స్థానిక అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని గ్రామస్థులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment