నో హెల్మెట్ నో ఎంట్రీ – మెదక్ ఆర్డీవో రమాదేవి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా రామాయంపేట తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు “నో హెల్మెట్ నో ఎంట్రీ” ప్రచారాన్ని ప్రారంభించారు.
మెదక్ ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ, రామాయంపేటలో రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉండడంతో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం. చిన్న తప్పిదాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి అని, కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఇంటి నుండి బయలుదేరే ముందు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

రామాయంపేట తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు లేదా దరఖాస్తుల కోసం వచ్చే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుంటే అనుమతి ఇవ్వబడదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment