శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ – బోనం సమర్పించిన ఎమ్యెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పట్టణంలోని 19వ డివిజన్ కంటేశ్వర్‌లో శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ఇందూర్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై భక్తిపూర్వకంగా బోనం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ — “మహాలక్ష్మి అమ్మవారి బోనాలు తెలంగాణ ఆచార–సాంప్రదాయాల ప్రతిబింబం. ప్రజల ఐకమత్యం, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తోంది,” అని పేర్కొన్నారు.

ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణలు, భక్తుల పాల్గొనడంతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు భక్తిపూర్వకంగా బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగోల్ల రవి, బిజెపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, మేకల సాయి ప్రవీణ్, బెండ ప్రసాద్, గుండు రవి, సాయిరాం, సాయిలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment