|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణప్ పరామర్శించారు. ప్రమోద్ తల్లి, భార్యతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ – “ప్రమోద్ త్యాగం ఎప్పటికీ మరువలేము. అతని కుటుంబం ఒంటరిగా లేదని, ప్రభుత్వం మరియు ప్రజలు వారితో ఉన్నారని” అన్నారు. కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, ప్రమోద్ పిల్లల విద్యా ఖర్చులు పదో తరగతి వరకు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
రౌడీషీటర్ రియాజ్ చేతిలో జరిగిన ఈ దారుణ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మీనారాయణ, నాయకులు న్యాలం రాజు, శివ, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.








