|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ రూర్బన్ ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్షిప్కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించారు.
గత సెప్టెంబర్ నెలలో కరీంనగర్లో నిర్వహించిన అంపైర్ – క్లినిక్ & అంతర్-జిల్లా టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన భాగ్యవాన్ ప్రశాంత్, సాయి ప్రసాద్ రాజు మరియు వేణు గౌడ్ లను ఈ నెలలో జరిగే 39వ సబ్ జూనియర్ బాలురు, 43వ జూనియర్ బాలురు, 45వ సీనియర్ పురుషుల జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక అయ్యారు.
ఈ అద్భుతమైన ప్రదర్శనకు అభినందనలు తెలియజేస్తూ, ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మీరు దేశానికి గౌరవం తీసుకురావాలని నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింత పటిష్టం చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.








