మెదక్ మహిళా హత్య కేసు నిందితుడు అరెస్ట్ – ఎస్పీ శ్రీనివాసరావు చర్యలతో కేసు వేగంగా ఛేదన.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 11-10-2025 న ఉదయం 10:30 గంటలకు ఏడుపాయల వద్ద గాలి అనిల్‌కుమార్ వెంచర్ వెనుక భాగంలో ఒక మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్నారని డయల్ 100 ద్వారా సమాచారం అందిందని తెలిపారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన మహిళను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించే సమయంలో మృతి చెందిందన్నారు.


మృతురాలు కాత్రోత్ కమ్లా (సంగాయిగూడ తాండ, కుల్చారం మండలం) గా గుర్తించారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఇద్దరు DSPలు, ముగ్గురు CIలు, SIలు, CCS బృందంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మెగావత్ ఫకీర్ నాయక్ (36) ను గుర్తించి మెదక్ చర్చి వెనుక ప్రాంతంలో అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడు మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుండి మృతురాలి ముక్కుపుడక, రాయి, బట్టలు స్వాధీనం చేసుకున్నారు.
కేసును వేగంగా ఛేదించినందుకు ఎస్పీ మెదక్ రూరల్ సీఐ జర్జ్, సిబ్బంది, CCS టీంకు రివార్డు మరియు ప్రశంస పత్రం అందజేశారు. ఎస్పీ శ్రీనివాసరావు ప్రజల భద్రత కోసం న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment