మెదక్ – సిద్దిపేట్ హైవే: తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారు వద్ద ఉన్న మెదక్-సిద్దిపేట్ నేషనల్ హైవే (N.H 765 DG) లోని 12 కిలోమీటర్ల బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా తాత్కాలిక రహదారి ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, కొత్తగా నిర్మించాల్సిన బ్రిడ్జికి అన్ని అనుమతులు త్వరగా తీసుకురావాలని, వర్షాకాలం ప్రారంభానికి ముందే నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు.

కలెక్టర్ పర్యటనలో నేషనల్ హైవే అధికారులు, ఇంజనీరింగ్ విభాగం ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైవే ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment