|| దృశ్యం న్యూస్ ||
మెదక్ పట్టణంలో మతపరమైన వివాదం చెలరేగింది. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఒక మతాన్ని ప్రచారం చేస్తూ మున్సిపల్ కార్మికులకు రేడియం సేఫ్టీ జాకెట్లపై మెదక్ చర్చి ముద్ర వేయించిన కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హిందువుల ఆత్మగౌరవాన్ని అవమానించే ఈ చర్యపై వెంటనే సస్పెన్షన్ చేయాలని మున్సిపల్ కార్మికులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన కమిషనర్ తక్షణమే క్షమాపణ చెప్పి, కార్మికులకు ఏ మతానికీ సంబంధించిన చిహ్నం లేకుండా న్యాయమైన జాకెట్లు ఇవ్వాలని హెచ్చరించారు. ఈ తప్పును సరిదిద్దకపోతే, మెదక్ మున్సిపల్ కార్యాలయాన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో ముట్టడి చేస్తామని స్పష్టంచేశారు.
స్థానిక సంస్థాగత ఎన్నికల నిబంధనలు ఉన్న సమయంలో ఈ సంఘటన పట్టణంలో ఎంతో ఉద్రిక్తతకు దారి తీస్తోంది. శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని కార్మికులు హెచ్చరిస్తు మతపరమైన ప్రచారానికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదని, చట్టం ముందర అందరూ సమానమేనని స్థానిక ప్రజలు గట్టిగా పేర్కొన్నారు.








