దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు.
గ్రామానికి చెందిన సంతోష్ పని నిమిత్తం ఇంటి బయటకు వెళ్లిన సమయాన్ని అదునుగా భావించి అదే గ్రామానికి చెందిన సునీల్ మరియు రవి అనే ఇద్దరు యువకులు సంతోష్ ఇంట్లోకి చొరబడాలని యత్నించడంతో ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి, ఇరువురికి దేహశుద్ధి చేసి దొంగతనానికి ప్రయత్నించిన దోషులను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

ఈ ఘటనకు సంబంధించి ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఈ సంఘటన వల్ల ప్రజల్లో భయాందోళన నెలకొంది, కాబట్టి స్థానికులు ఇలాంటి పరిణామాలను అరికట్టటానికి చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment