|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా 6వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫారం వద్ద గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న లారీ బోల్తా పడింది.

స్థానికుల వివరాల ప్రకారం హైదరాబాదు నుండి నిండు గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ కు ఆరోగ్య సమస్య ఏర్పడటంతో, లారీ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న డైరీ ఫారం వద్ద ఉన్న చిన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, డ్రైవర్ ను లారీ నుండి బయటకు తీసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే సిలిండర్లు నిండుగా ఉన్నప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది అని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు వివరాలు సేకరించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.








