|| దృశ్యం న్యూస్ ||
కామారెడ్డి జిల్లా, ఎస్పీ యం. రాజేష్ చంద్ర పర్యవేక్షణలో మొబైల్ ఫోన్ల రికవరీపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ప్రతి నెల 150కు పైగా మొబైల్ ఫోన్లు జిల్లా పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ. 2.75 కోట్లు విలువైన 1,722 ఫోన్లు తిరిగి బాధితులకు అందజేశారు.

తాజా డ్రైవ్‌లో 143 ఫోన్లు (రూ. 23 లక్షలు విలువ) రికవరీ అయ్యాయి.
మొబైల్ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైనవారు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, సిమ్ కార్డ్ బ్లాక్ చేసి CEIR పోర్టల్‌లో IMEI నమోదు చేయాలని ఎస్పీ సూచించారు.
అదేవిధంగా మొబైల్‌లో ఉండే వ్యక్తిగత డేటా, బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియా సమాచారం సైబర్ మోసాలకు కారణమవుతాయని, అందుకే జాగ్రత్తలు తప్పనిసరి అని ఎస్పీ హెచ్చరించారు.
రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను పొందడానికి బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయంలోని RSI బాలరాజు (ఫోన్: 8712686114) గారిని సంప్రదించవచ్చు అని తెలిపారు.








