కామారెడ్డి: మరో కానిస్టేబుల్ సస్పెన్షన్ – అనైతిక చర్యలపై ఎస్పీ కఠిన హెచ్చరిక చర్య.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ. విశ్వనాథం (2078) శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు. స్టేషన్‌కు చెందిన బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనం TS09 GL TR 6686ను ఎలాంటి అధికార అనుమతి లేకుండా వ్యక్తిగత అవసరాల కోసం తీసుకెళ్లి, ప్రశాంత్ అనే వ్యక్తి మెకానిక్ షాప్ వద్ద ఉంచినట్టు విచారణలో బయటపడింది.

స్టేషన్‌లో వాహనాల తనిఖీలు జరుగుతున్న విషయం తెలుసుకున్న తర్వాత, విశ్వనాథం ఉదయం సమయంలో వాహనాన్ని తిరిగి తీసుకొచ్చి స్టేషన్‌లో పార్క్ చేసి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు. ఈ చర్యను అత్యంత అభ్యంతరకరంగా పరిగణించిన ఎస్పీ ఇది పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తనగా పేర్కొంటూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర గారు మాట్లాడుతూ, “ప్రతి పోలీసు సిబ్బంది నిజాయితీ, నైతికత, నియమాలను కచ్చితంగా పాటించాలి అని, అనుమతి లేకుండా స్టేషన్ వాహనాలను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడం తీవ్రమైన తప్పు అని, క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన శాఖ చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment