|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజు జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి వచ్చిన సమస్యలను వినిపించుకొని, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, ఏఎస్ఐ మరియు సిఐ లతో ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యల స్థితిని ఆలోచించి వాటి పరిష్కారానికి తక్షణ సూచనలు చేయడం జరిగింది.

“ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, స్వచ్చందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, వారి సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలి” అని జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. తెలిపారు.
ప్రజా సమస్యలపై ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, ప్రతి సోమవారం “ప్రజావాణి” కార్యక్రమం ద్వారా వాటిని పరిష్కరించేందుకు పోలీసులు ముందుకు కొనసాగుతున్నారు.








