తిమ్మాపూర్ గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం : పశువుల పై దాడి

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, మోస్రా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది, గత కొన్ని రోజులుగా ఈ గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత పులి పశువులపై దాడి చేసి వాటిని గాయపరుస్తుందని కాపరులు తెలిపారు.

ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారులకు పశువుల కాపరులు సమాచారం అందించి వివరణ కోరగా, గడచిన కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం నిజమేనని పశువుల కాపరులు అ ప్రాంతం వైపు కాకుండా మరొక ప్రదేశానికి వెళ్లాలని సూచించారు. దాడి జరిగిన ప్రాంతంలో నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని మోస్రా మండల అటవీ శాఖ బీట్ అధికారి హుస్సేన్ తెలిపారు.

ఈ ప్రాంతంలో చిరుత పులి సంచారం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment