అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు – కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ 3వ నెంబరు అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం, సుమారు 40 కిలోల బియ్యం, పాలు, బాలామృతం సైకిల్ ద్వారా తరలిస్తుండగా కాలనీ వాసులు పట్టుకున్నారు. ఈ విషయమై గ్రామస్థులు ఫిర్యాదు చేసారు.

 

ఎస్సై ముత్యాల రమా మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం, అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, సహాయకురాలు ఆయమ్మ కోడలు మమత, మరియు షేక్ అబ్దుల్లాపై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డ ఈ చర్యను పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
ఇలాంటి అక్రమాలు ఎక్కడ జరిగినా ఉపేక్షించము అని ఎస్‌ఐ రమా స్పష్టం చేశారు.

అక్రమంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడాన్ని సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాలలో జరిగే అనుమానాస్పద చాటుమాటు వ్యవహారాల పట్ల వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment