|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన బోదాసు రాజమణి తన కుమారుడు బోదాసు రాజేష్ (17) విషయంలో పోలీసులకు ఫిర్యాదు ప్రకారం.
తన కుమారుడు రాజేష్, స్నేహితుడు సూరి ఆకాష్ కలిసి ఆకాష్ తండ్రి దుబాయి నుండి పంపిన వస్తువులను తీసుకురావడానికి రామారెడ్డి గ్రామానికి బయలుదేరినట్లు తెలిపుతూ, ఈ ప్రయాణంలో రాజేష్ బైక్ నడిపిస్తుండగా, ఆకాష్ వెనుక కూర్చుని ఉన్నాడు.
మధ్యాహ్న సమయంలో కొటాలపల్లి శివారులోని ఒక మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో ఈ ప్రమాదంలో రాజేష్ తలకు తీవ్రగాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు అని,
ఫిర్యాదు అందుకున్న ధర్పల్లి ఎస్సై కళ్యాణి కేసు నమోదు చేసి, శవ పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిజామాబాద్ మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో యువకుడు మృతిచెందటంతో స్థానికంగా విషాదాన్ని సృష్టించింది.








