అనాధ శిశువుకి నామకరణం చేసి సంరక్షణ సంస్థకు అందజేసిన జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ప్రతిమరాజ్.

|| దృశ్యం న్యూస్ ||

గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన మైనర్ బాలిక గర్భంతో నిజామాబాద్ జి జి హెచ్ ఆసుపత్రిలో క్లిష్టమైన స్థితిలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిందని, అ బాలికతో పాటు సంబంధికులు ఎవరు లేకపోవడంతో డాక్టర్లు ఆమెకు అత్యవసర వైద్యం అందించారాని, అ బాలిక ఓ శిశువుకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించిందని, అనంతరం తన శిశువుకు శ్వాస సంబంధిత సమస్యల కారణంగా 46 రోజుల పాటు NICUలో తగిన ప్రత్యేక ఏర్పాట్లు చేసి వైద్యుల పర్యవేక్షణలో కాపాడడం జరిగిందని డా. ప్రతిమరాజ్ తెలిపారు.

ఈ మైనర్ బాలికకు సంబంధించి భర్తను కొన్ని కారణాల వల్ల పోలీసులు అరెస్టు చేయడంతో అనాధగా మిగిలిన ఆ శిశువును మానవతా భావనతో డాక్టర్ ప్రతిమరాజ్ “ఆకర్ష” అని నామకరణం చేసి జిల్లా శిశు గృహ సిబ్బందికి అందజేశారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు, బాలిక మృతి మరియు శిశువుకు సంబంధించిన ఈ కేసు మానవత్వానికి సంబంధించిన ముఖ్యమైన కొన్ని పాఠాలను మేము నేర్చుకున్నామని ఇలాంటి పరిస్థితుల్లో సమాజానికి ఎలా సహాయం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అని డాక్టర్ ప్రతిమ రాజ్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment