|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పంచాయతీ ఎన్నికలతో మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మండల రాజకీయం వేడెక్కింది. మొదటి విడతలో ఈ మండలం ఉండటంతో, నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమై శనివారంతో ముగిసింది. మొదట రెండు రోజులు నెమ్మదిగా ప్రశాంతంగా సాగిన ఎన్నికల ప్రక్రియ, చివరి రోజు ఎన్నికల కేంద్రాల వద్ద అభ్యర్థుల భారీ రద్దీతో ఉత్కంఠభరితంగా మారింది.
మండలంలో ఎన్నికల అధికారులు 17 గ్రామాలకు 9 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చివరి రోజు అయిన శనివారం ఉదయం మొదలైన స్వీకరణ, కొన్ని గ్రామాల్లో రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. మొదటి విడత ప్రక్రియ పూర్తయ్యేసరికి, మొత్తం 17 సర్పంచ్ పదవి స్థానాలకు 110 సర్పంచ్ నామినేషన్లు అభ్యర్థుల నుండి స్వీకరించగా, 166 వార్డులకు 389 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు అందాయి.
మండలంలో జనరల్ మహిళ స్థానమైన జానకంపేట్ గ్రామంలో అత్యధికంగా 13 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. మరోవైపు బాపునగర్ గ్రామంలో కేవలం 2 నామినేషన్లు మాత్రమే రావడం, అ రెండూ ఒకే అభ్యర్థి దాఖలు చేసి అనధికార ఏకగ్రీవం సాధించారు.
వార్డు స్థానాల్లో కూడా బాపునగర్ ప్రత్యేక రికార్డు సృష్టించింది. 8 వార్డులకు 8 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో, అక్కడ కూడా అభ్యర్థులందరూ అనధికారంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, ఎడపల్లి మండల కేంద్రంలో 14 వార్డులకు 51 మంది పోటీదారులు నామినేషన్లు దాఖలు చేసి అత్యధిక సంఖ్యలో నిలిచారు.
శనివారంతో నామినేషన్ల స్వీకరణతో ఎడపల్లి మండలంలో ఎన్నికల మొదటి ఘట్టం ముగిసింది. ఆదివారం ఉదయం నుండి అధికారులు పత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం చేయనున్నారు.
మండల ఎన్నికల అధికారులు ఎడపల్లి పరిధిలోని గ్రామాల వారిగా ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి👇










