పలు సమస్యలపై తహశీల్ధార్ కార్యాలయంలో ఫిర్యాదు : నాలుగు నెలలు గడుస్తున్నా స్పందించని అధికారులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులలో గల మా శారదా సాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ మరియు సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ లపై ఎడపల్లి మండల తహశీల్ధార్, గ్రామ పంచాయతీ కార్యాలయలలో ఫిర్యాదు చేసి నాలుగు నెలలు గడిచినా సంబంధిత అధికారులు ఇప్పటికి స్పందించకపోవడం పై ఫిర్యాదుదారులు, గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మా శారదా సాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ వ్యర్ధాలపై, కాలుష్యంపై ఫిర్యాదు:

గ్రామ శివారు అయిన అశోక్ సాగర్ సమీపంలో మా శారదా సాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ ద్వారా వెలువడే వ్యర్ధాల వల్ల చుట్టూ ఉన్న పంటపొలాల భూములు కలుషితమై పంట దిగుబడి రాక రైతులు ఎన్నో అనర్థాలు ఎదుర్కుంటున్నారని, అదేవిధంగా ఇండ్రస్ట్రియల్ చేసిన అనంతరం వచ్చే వ్యర్థ పదార్థాలను గ్రామంలో లోతట్టు ప్రాంతాలలో, మరియు ఆధునిక వెంచర్లలో భర్తీ చేస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఈ ఇండ్రస్ట్రీ నుండి వాతావరణ కాలుష్యం ఏర్పడితుందని ఫిర్యాదు చెయ్యడంతో ఈ విషయమై కంపెనీ మేనేజర్ దుర్భశాలు ఆడుతూ, కంపెనీ జోలికి వస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించినట్లు ఫిర్యాదులో తెలిపారు.

సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ భూమి ఆక్రమణ :

గ్రామ శివారు అయిన సర్వే నంబర్ 612/1 ప్రభుత్వ భూమిలో సిమెంట్ మిక్సింగ్ కేంద్ర యాజమాన్యం అక్రమ నిర్మాణం పై ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 612/1 భూమిని అనుకోని మల్లప్ప ఉన్న మల్లప్ప చెరువు FTL బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం చేపట్టారని, ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఫిర్యాదు చేశారు.

ఈ రెండు అంశాలపై తహశీల్ధార్ కార్యాలయంలో, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా సంబంధిత యంత్రాంగం స్పందించకపోవడం పై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తు, ఇకనైనా స్పందించకపోతే ఈ విషయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment