బోధన్ పట్టణంలో అగ్ని ప్రమాదం : లక్ష రూపాయల ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 29వ వార్డులో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక శివాలయ ప్రధాన వీధిలో వెండి సాయిలు అనే వ్యక్తి యొక్క పెంకుటిల్లులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వెంటనే సమీపంలోని మోటర్ పంపు ద్వారా నీటిని చిమ్మి మంటలను కాస్త అదుపులోకి తెచ్చారు. అనంతరం వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు.

ఈ అగ్ని ప్రమాదం విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది అని, అదేవిధంగా విలువైన పత్రాలు మరియు నగదు కాలిపోయాయి.
ప్రమాదం జరిగే సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు అని బాధితులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment