|| దృశ్యం న్యూస్ ||
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చర్యల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిల్మ్ నగర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ గౌడ్ ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. బల్కంపేటలో నిర్వహించిన బందోబస్తు కార్యక్రమం ముగించుకుని స్వగృహమైన చాణక్యపురి కాలనీ (సంగారెడ్డి)కి కారులో తిరిగి వెళ్తుండగా ఎస్సై ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేష్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజేష్ గౌడ్ విధుల పట్ల నిబద్ధత, ప్రజలతో మమేకమైన వ్యవహార శైలి పోలీస్ శాఖలో విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఈ దుర్ఘటనపై సహచరులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.








