|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో ఎన్నికల సందడి శనివారం మరింత ఊపందుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం అభ్యర్థులు, అనుచరులతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో గ్రామంలోని సర్పంచ్ పదవి పోటీకి ప్రధాన వర్గానికి చెందిన పుప్పాల అర్చన శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.
గ్రామంలో జనరల్ మహిళ రిజర్వేషన్ లభించడంతో గ్రామ మహిళా నాయకత్వానికి కొత్త అవకాశాలను ఏర్పడ్డాయని అర్చన శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో గ్రామ అభివృద్ధిని తన ప్రధాన లక్ష్యంగా ప్రకటించిన అర్చన, మౌలిక వసతుల పురోగతి, మహిళలు–యువత సాధికారత, శుభ్రత–స్వచ్ఛత, విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
గ్రామ ప్రజా ఆశీస్సులు తనను విజయం దిశగా నడిపిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. జానకంపేట్‌లో సర్పంచ్ పోటీ ఈసారి మరింత ఆసక్తికరంగా మారింది.








