|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ప్రజలకు మరియు కలెక్టరేట్ కార్యాలయ వివిధ శాఖల ఉద్యోగులకు హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగలపై అవగాహన కల్పించారు.
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేట్ వద్ద బైక్ సవారీ చేసే ఉద్యోగులు హెల్మెట్ ధరించకుండా వారికి డిఆర్ఓ భుజంగరావు మరియు సంబంధిత సిబ్బందితో కలిసి వారికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంలో కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ‘‘రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయం అని, ప్రయాణం ఎంత ముఖ్యమో, గమ్యస్థానం చేరడం కూడా అంతే ముఖ్యం అని, ఎలాంటి పరిస్థితుల్లోనూ హెల్మెట్ ధరించకుండా ప్రయాణించకూడదని’’ తెలిపారు.
అదేవిధంగా ‘‘మన ప్రాణాలు మన కుటుంబానికి ఎంతో ముఖ్యం, ప్రమాదం జరగడానికి ముందే జాగ్రత్తలు తీసుకోవాలి అని, హెల్మెట్ ధరించడం మాత్రమే మన రక్షణకు, ఆరోగ్యానికి ఉపయోగకరమని’’ తెలిపారు.
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు అన్ని ధ్రువపత్రాలను తనిఖీ చేసుకోవాలని మరియు రోడ్డుపై భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.








