ధర్పల్లి: ఎరువుల గిడ్డంగి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు సొసైటీ పరిధిలోని మైలారం గ్రామంలో బుధవారం నాడు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న ఎరువుల గిడ్డంగి భవనానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి హాజరై భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ గిడ్డంగి ద్వారా రైతులకు తక్షణ అవసరాలకు అనుగుణంగా ఎరువుల సరఫరా సులభమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ధర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, రామడుగు సొసైటీ చైర్మన్ మనోహర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మంత్యా నాయక్, నాయకులు చెలిమెల నర్సయ్య, చెలిమెల శ్రీనివాస్, పుప్పాల సుభాష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment