ఆన్‌లైన్ బెట్టింగ్ & గేమింగ్ మోసాలకు యువత బలికావద్దు – మెదక్ జిల్లా ఎస్పీ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, యువత ఆన్‌లైన్ బెట్టింగ్ & గేమింగ్ యాప్స్ వల్ల మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అక్రమ బెట్టింగ్ & గేమింగ్ యాప్‌లకు అలవాటు పడిన యువత అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ మోసాలను కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అక్రమ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుఎన్సర్లపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 100 డయల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment