ప్రజావాణి కార్యక్రమం : పిర్యాదుల స్వీకరణలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి సమస్యలు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను సూత్రప్రాయంగా సూచనలు అందించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా వచ్చిన పిర్యాదులపై ఎస్ఐ మరియు సిఐ లతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితి తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గనిర్దేశం చేశారు.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు ఎలాంటి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, పైరవీలు లేకుండా పోలీసు సేవలను స్వచ్చందంగా వినియోగించుకుంటూ తమ సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకుంటున్నారు. ఇది ప్రజలతో పోలీసులు మరింత దగ్గరయ్యే అవకాశాన్ని కల్పించుకుంటుంది అని, జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఈ సందర్భంగా చెప్పారు,
“ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది అని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పూర్తి న్యాయం అందించడం మా లక్ష్యం.” అని తెలిపారు.

అదేవిధంగా ప్రజలకు శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు జిల్లా పోలీసులు కట్టుబడి ఉంటారని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment