మోస్రా జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్,
మోస్రా గ్రామంలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలసి కాస్త సమయం గడిపారు,
ఈ సందర్శనలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు గణితం సబ్జెక్టు బోధింస్తూ, పాఠశాలలోని విద్యార్థులకు గణిత శాస్త్ర పాఠాలు క్లిష్టమైన ప్రశ్నలు నైపుణ్యంతో ఎలా సాధించాలో సులభంగా అర్థమయ్యే విధంగా వివరించి విద్యార్థులు ఆసక్తిగా చదివేలా ప్రేరణ కల్పించారు.

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసారు,
ఈ సందర్శనపై పాఠశాల ఉపాధ్యాయులు మరియు స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఈ తరహా కార్యక్రమాలు సమర్ధవంతంగా ఉంటాయని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment