వర్ని: నూతన రేషన్ కార్డుల పంపిణీ – ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలోని CCD ఫంక్షన్ హాల్‌లో వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాల రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతోలు పాల్గొన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా పంపిణీ చేశారు.

మొత్తం 125 మంది లబ్ధిదారులకు రూ.1.25 కోట్లు పంపిణీ కాగా, ఈ కార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు కులకర్ణి సురేష్ బాబా, కోటగిరి చైర్మన్ గైక్వాడ్ హనుమంత్, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment