|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు.
కాంగ్రెస్ నాయకులు విజయ్ గౌడ్, జహీర్ ఉద్దీన్, మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి విజయవంతమైన నాయకత్వంతో రాష్ట్ర అభివృద్ధికి అనేక కీలక కార్యక్రమాలు చేపట్టారాని, మరిన్ని ఆర్థిక, సామాజిక అభివృద్ధి పనులు చేపడతారని ఆశిస్తున్నాను అని తెలిపారు.
సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్లు, రేవంత్ రెడ్డి మరెన్నో విజయాలు సాధించాలని అభిలషించారు.
ఈ వేడుకలో గ్రామస్తులు, విద్యార్థులు ఆనందంగా పాల్గొని, సిఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చేపూరి కిషోర్ మైనార్టీ అద్యక్షులు షేక్ తహెర్ యువజన నాయకులు బి. లక్ష్మణ్, ఎస్ సి సెల్ అద్యక్షులు ఏంబా మోహన్, కిషన్ గౌడ్, లింగం, సయ్యద్ గౌస్, సయ్యద్ ఖలీద్, కరీం, ఉడత గంగాధర్ ఎస్ సి సెల్ జిల్లా నాయకులు సంజయ్, మైనార్టీ మండల జనరల్ సెక్రెటరీ యండి ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.








