145 మంది లబ్దిదారులకు 41,75,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ 145 మంది లబ్దిదారులకు 41,75,500 రూపాయల విలువ గల చెక్కులను అందించారు.
ఈ చెక్కులు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా సమకూర్చడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పల్ మాట్లాడుతూ,
“ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం సహాయ నిధి ద్వారా అధికంగా చెక్కుల పంపిణీ మా నియోజకవర్గానికి మాత్రమే అందించడం జరిగిందని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర సచివాలయానికి ఎటువంటి జాప్యం లేకుండా పనులు జరుగుతున్నాయని తెలిపారు.

కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెక్కుల జారీ విషయంలో జాప్యం చేస్తున్నదని ఆరోపిస్తూ దీనివల్ల బాధితులకు చికిత్స ఖర్చు ఒక ఆర్థిక భారం అవుతుంది. “రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల జాప్యం మరియు అప్లై చేసిన మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తాను” అని సీఎం సహాయ నిధి ద్వారా జరిగే ఈ చెక్కుల పంపిణీ బాధితుల జీవితాల్లో ఆశను పదిల పరచడం కోసం మరింత సమర్ధవంతంగా వ్యవస్థను కొనసాగిస్తూ ఈ విషయంలో ప్రత్యేక విధానంతో కట్టుబడవలసి ఉంటుంది అని ఎమ్మెల్యే ధన్ పాల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment