|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని NTR కాలనీకి చెందిన ఆకుల కళ్యాణ్ ఫిర్యాదు మేరకు ద్విచక్ర వాహనం తగలబెట్టిన ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు రిమాండ్‌కు పంపించారు.
ఆదివారం రాత్రి నిందితులు కనకం కిషోర్, షేక్ ఇమ్రాన్, జోగినిపల్లి రాహుల్ గౌడ్‌లు కళ్యాణ్ ఇంటి వద్ద గొడవపడి, తిట్టి, బెదిరింపులు చేసి వెళ్లిపోయారు. అనంతరం అర్థరాత్రి కిషోర్, ఇమ్రాన్ లు తిరిగి వచ్చి కళ్యాణ్ ను బయటకు రమ్మని, రాకుంటే ఇల్లు తగలబెడతామని హెచ్చరించారని, కళ్యాణ్ బయటకు రాకపోవడంతో బైక్‌ను బలవంతంగా తీసుకెళ్లి NTR కాలనీ చౌరస్తాలో పెట్రోల్ పోసి తగలబెట్టారని ధర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకుని రిమాండ్‌కు పంపించారు.








