|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ప్రగతినగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులుగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా వ్యాప్తంగా మున్నూరుకాపు సంఘ సభ్యులు మాత్రమే కాకుండా వివిధ కులవర్గాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మపురి సంజయ్‌కు అభిమానులు, ప్రజలు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ (DS) అడుగుజాడల్లో సాగుతూ మున్నూరుకాపు సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని, నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో కృషి కొనసాగిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సంజయ్ మరిన్ని పదవులు అలంకరించి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి & సంక్షేమ పథకాల సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి,
ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,
రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ & మైనార్టీ శాఖల సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తహెర్ బిన్ అంధన్, రాజ్యసభ సభ్యులు కె.ఆర్. సురేష్ రెడ్డి, ఎమ్యెల్యేలు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.








