|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో గురువారం D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కీలక మలుపు తిరిగింది. శుక్రవారం ఉదయం పోలీసులు బాలిక ఆచూకీని నిర్ధారించారు. మృత బాలిక మహారాష్ట్ర ముత్కేడ్ జిల్లా నివాసిగా గుర్తించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
బాలిక మృతి వెనుక గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బాలిక మృతదేహం తెలంగాణలోని కెనాల్‌లో లభించడం పలు సందేహాలకు తావిస్తోంది. హత్య, లేదా ప్రమాదవశాత్తా మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఉన్నత పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. బాలిక ఇక్కడికి ఎలా చేరింది? ఎవరి ప్రమేయం ఉందా? అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.








